హైదరాబాద్‌లో “ఓం ఆధ్యాత్మిక నగరం”

రామోజీఫిల్మ్‌ సిటీ దగ్గర నిర్మించతలపెట్టిన ‘‘ఓం ఆధ్యాత్మిక నగరం’’ కాపీ టేబుల్‌ బుక్‌ మొదటి ప్రతిని తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్‌కు అందజేసిన రామోజీరావు . ఓం సిటీలో 108 ప్రసిద్ధ ఆలయాల నమూనాలను నిర్మిస్తున్నామని, ఈ సిటీ అంతా తిరిగేందుకు వారం పడుతుందని రామోజీ రావు తెలిపారు.

సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ ప్రపంచ స్థాయి ఆధ్యాత్మిక నగరం నిర్మించడం అభినందనీయమన్నారు. హైదరాబాద్‌లో ఆధ్యాత్మిక నగరం నిర్మాణంతో కొన్ని వేల మందికి ఉపాధి అవకాశం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎలాంటి ఆటంకాలు లేకుండా ఓం ఆధ్యాత్మిక నగర నిర్మాణం త్వరితగతిన పూర్తికావాలని కేసీఆర్‌ ఆకాంక్షించారు.

Leave a Comment