హైదరాబాద్ పోలీసులు ‘లాస్ట్‌ రిపోర్ట్‌’ ! స్మార్ట్‌ పోలీసింగ్‌ నూతనంగా యాప్‌ ప్రారంభం.

ఏ వస్తువు పోయినా లేక ధ్రువీకరణ పత్రాలైనా ఆన్‌లైన్‌లో ఫిర్యాదు
పోలీసు కమిషనర్‌ మహేందర్‌రెడ్డి, అదనపు కమిషనర్‌ అంజనీకుమార్‌, స్పెషల్‌బ్రాంచ్‌ సంయుక్త కమిషనర్‌ వై.నాగిరెడ్డి, సీసీఎస్‌ ఉపకమిషనర్‌ సి.రవివర్మ ప్రారంభించారు.
ఆధార్‌ నంబర్‌ నమోదు మరియు డిజిటల్‌ సంతకంతో రిపోర్టు ఇస్తే మూడు రోజులు అంటే 72 గంటల్లో ఈ మెయిల్‌తోపాటు సెల్‌ఫోన్‌కు పోలీసులు ఓ ధ్రువీకరణపత్రాన్ని పంపుతారు.ఏదైనా వస్తువు, ధ్రువీకరణపత్రం పోగొట్టుకున్న వ్యక్తి ఆన్‌లైన్‌లో ఫిర్యాదు రాగానే కమిషనరేట్‌లో గల విభాగం సిబ్బంది సంబంధిత వ్యక్తి పూర్తిచరిత్రను తెలుసుకుంటారు. వారిపై ఏమైనా నేరచరిత్ర లేక కోర్టులో కేసులు పెండింగ్‌లో ఉన్నాయా? అన్న విషయాలను పరిశీలించిన తర్వాత క్లియరెన్స్‌ సర్టిఫికెట్‌ ఇస్తారు.

Leave a Comment