హైదరాబాద్ ఫ్రెండ్స్ యూత్(HYFY) లండన్ ఆధ్వర్యంలో ఘనంగా వినాయక చవితి వేడుకలు.

లండన్: రీడింగ్ లో ఘనంగా వినాయక నిమజ్జనం జరిగింది. హైదరాబాద్ ఫ్రెండ్స్ యూత్(HYFY) లండన్ ఆధ్వర్యంలో ఘనంగా వినాయక చవితి వేడుకలు జరిగాయి. భక్తి శ్రద్ధలతో పూజలు చేసిన అనంతరం వినాయక నిమజ్జనం కూడా ఘనంగా నిర్వహించారు. భారీ ఎత్తున రీడింగ్ వీధుల్లో నృత్యాలతో నిమజ్జన కార్యక్రమం సాగింది. ఇందులో వివిధ రాష్ట్రాలకు చెందిన కుటుంబాలు పాల్గొని, ఆట పాటలతో సంబరాలు చేశారు.

‘గణపతి బప్పా మోరయా’, ‘భారత్ మాతా కి జై’ అంటూ రీడింగ్ వీధులు దద్దరిల్లాయి, బ్రిటన్ వాసులు కూడా తరలి వచ్చి ఈ వేడుకల్లో పాల్గొనడం విశేషం. సంస్థ ముఖ్య నిర్వాహకులు రత్నాకర్ కడుదుల, నవీన్ రెడ్డి, మల్లా రెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్ ఒక కాస్మోపాలిటన్ ప్రాంతం అని, ఎలాగైతే అక్కడ వివిధ ప్రాంతాల, మతాల ప్రజలు కలిసి మెలిసి ఉంటారో అలాగే ఇక్కడ కూడా అందరిరనీ కలుపుకొని ఈ వేడుకలు జరుపు కోవడం చాల సంతోషంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన అందరికి కృతఙ్ఞతలు తెలిపారు.ఈ పూజ కోసం కోసం ప్రత్యేకంగా లడ్డూ  తయారు చేసిన లక్ష్మి చిన్నం గారిని నిర్వాహకులు అభినందించడం జరిగింది.

ఎన్నారై టిఆర్ఎస్ అధ్యక్షులు మరియు తెలంగాణా NRI ఫోరం ఫౌండర్ మెంబర్ అనిల్ కూర్మాచలం, తెలంగాణ ఎన్నారై ఫోరం వైస్ ప్రెసిడెంట్ పవిత్ర రెడ్డి కంది దంపతులు మరియు ఇతర సభ్యులు కుటుంబ సమేతంగా హాజరై ప్రత్యేక పూజలు చేశారు. వేలంలో తక్కళ్లపల్లి శ్రీధర్ రావు,దీప్తి దంపతులు 601 పౌండ్స్‌కి లడ్డూ ప్రసాదం దక్కించుకున్నారు. కార్యక్రమ నిర్వాహకులు రత్నాకర్ కడుదుల, నవీన్ రెడ్డి, మల్లా రెడ్డి,  శుష్మన, రాజు , నాగార్జున ,ధర్మ , నాగరాజు గరిపెల్లి, సత్య రెడ్డి పింగిలి ,శివ చిన్నం, లక్ష్మి చిన్నం, శివరామా గుప్త , సత్య , అపర్ణ ,వెంకట్ రెడ్డి, విక్రం రెడ్డి, సత్యం ,సుమ,శారధ ప్రసాద్ పెండ్యాల,  తదితరులు పాల్గొన్నారు.

https://www.facebook.com/hyderabadifriendsuk/
ganesha-reading1ganesha-2

 

Leave a Comment