13ఏళ్లకే సిలికాన్ వ్యాలీలో కంపెనీ… రికార్డు సృష్టించిన భారత సంతతి విద్యార్ధి

subham

అమెరికాలోని సిలికాన్ వ్యాలీలో 13 ఏళ్ల వయస్సులో బ్రెయిగ్ లాబ్స్ అనే కంపెనీని నెలకొల్పి రికార్డు సృష్టించాడు భారత సంతతికి చెందిన శుభమ్ బెనర్జీ అనే ఎనిమిదవ తరగతి చదువుతున్నవిద్యార్ధి. కాలిఫోర్నియాకు చెందిన ఈ విద్యార్ధి బ్రెయిగో అనే విధానాన్ని ప్రవేశపెట్టాడు.

అంధులు వాడే బ్రెయిలీ లిపిని రోబోల ద్వారా ప్రింట్ చేసే తక్కువ ధర మెషిన్లను బెనర్జీ ఆవిష్కరించాడు. టెక్నాలజీ దిగ్గజం ఇంటెల్ కార్పోరేషన్ ఈ మిషన్లను తయారు చేయడానికి పెట్టుబడి పెట్టింది. గత ఏడాది స్కూల్లో జరిగిన సైన్సు ఎగ్జిబిషన్ ప్రాజెక్టులో లెగో రోబోటిక్స్‌తో రూపొందించిన బ్రెయిలీ ప్రింటర్‌ను సందర్శనకు ఉంచాడు.

అంధులు ఎలా చదువుతారు అని తల్లిదండ్రులను ప్రశ్నించగా… దానికి వారిచ్చిన సమాధానం గూగుల్‌లో శోధించు. వెంటనే ఆన్‌లైన్‌లో శోధించగా ఆశ్చర్యకరమైన విషయాలు అతనికి తెలిశాయి. అంధులు చదువేందుకు రూపొందించిన బ్రెయిలీ ప్రింటర్స్ ధర అతి తక్కువలో తక్కువ 2000 అమెరికన్ డాలర్లు.

అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఇంత ఖరీదు పెట్టి అంధులు బ్రెయిలీ ప్రింటర్స్‌ను కోనుగోలు చేయడం కష్టం. కాబట్టి తక్కువ ధరలో వారికి బ్రెయిలీ ప్రింటర్స్‌ను అందించాలనే ఉద్దేశ్యంతో దీనిని కనిపెట్టడం జరిగిందని శుభమ్ తెలిపాడు.

ఇంట్లోని కిచెన్ టేటుల్ మీద ఎన్నో నిద్రలేని రాత్రులను గడిపి తన ఈవీ3 కిట్‌తో ఈ బ్రెయిలీ ప్రింటర్‌ను తయారు చేశానని చెప్పాడు. ప్రస్తుతం మార్కెట్లో లభ్యమయ్యే బ్రెయిలీ ప్రింటర్‌ సుమారు 9 కిలోల బరువు ఉండగా… శుభమ్ బెనర్జీ తయారు చేసిన బ్రెయిలీ ప్రింటర్‌ తక్కువ బరువుతో పాటు 350 డాలర్లు మాత్రమే తయారీకి ఖర్చు అయిందని తెలిపాడు.

Leave a Comment