19న చంద్రబాబు అధికారిక గృహప్రవేశం

Chandrababu Naiduహైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నెల 19వ తేది గురువారం  ఉదయం 8 గంటలకు లేక్‌వ్యూ అతిథి గృహంలోకి ప్రవేశించనున్నారు. అనంతరం అక్కడి నుంచే ఆయన శాసనసభకు వెళతారు.  రాష్ట్ర విభజన నేపధ్యంలో అధికారికి భవనాలను కూడా విభజించిన విషయం తెలిసిందే. అందులో భాగంగా  లేక్‌వ్యూ అతిథి గృహాన్ని ఏపి ముఖ్యమంత్రి క్యాంప్‌ కార్యాలయంగా మార్చేశారు. ఇక్కడ నుంచే చంద్రబాబు పరిపాలన సాగిస్తారు. ఆయన అధికార నివాసం కూడా ఇదే.

దీనిని ఏపి సిఎంకు కేటాయించిన   నేపథ్యంలో ఈ అతిథి గృహం మరమ్మతులు, సౌకర్యాల కల్పనకు ప్రభుత్వం దాదాపు మూడు కోట్ల రూపాయలు ఖర్చు చేసింది.  ఇంటెలిజెన్స్‌ విభాగం సూచనల మేరకు రక్షణను దృష్టిలో పెట్టుకుని ఇక్కడ భద్రతా ఏర్పాట్లు చేశారు.

Leave a Comment