20 మందికి ఛాన్స్ ఇస్తున్న మోడీ..?

ప్రధాని నరేంద్ర మోడీ కేంద్ర మంత్రివర్గాన్ని విస్తరిస్తున్నారు. సికింద్రాబాద్ ఎంపీ బండారు దత్తాత్రేయ, శివసేన నుంచి ఇద్దరికి, టీడీపీ ఒకరికి ఛాన్స్ ఇస్తున్న మోడీ.. మొత్తంగా 20 మందికి ఛాన్స్ ఇస్తున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు పలువురు ఎంపీలకు ప్రధానమంత్రి కార్యాలయం నుంచి ఫోన్లు వెళ్లాయి. ఇప్పటికే 16 మంది బీజేపీ ఎంపీలకు ప్రధానమంత్రి కార్యాలయం నుంచి ఫోన్లు వెళ్లాయి. మొత్తం 20 మంది వరకు కొత్త మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇంతవరకు గోవా ముఖ్యమంత్రిగా పనిచేసిన మనోహర్ పారిక్కర్ను కూడా కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకుంటున్నందున ఆయన ఆ పదవికి రాజీనామా చేశారు. ఉత్తరప్రదేశ్ నుంచి ఆయనను రాజ్యసభకు ఎన్నుకోడానికి రంగం సిద్దం చేస్తున్నారు. ఢిల్లీలో ఆదివారం కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు.

Leave a Comment