కుప్పకూలిన ఇరాన్ విమానం

51407653907_625x300టెహ్రాన్: మలేసియా విమాన దుర్ఘటన మరవకముందే మరో విమాన ప్రమాదం చోటుచేసుకుంది. ఇరాన్ పౌర విమానం ఒకటి ఆదివారం కూలిపోయింది. టెహ్రాన్ లోని మెహ్రాబాద్ విమానాశ్రయం నుంచి బయలుదేరిన టబాన్ ఎయిర్ లైన్స్ విమానం ఈ ఉదయం 9.18 నిమిషాలకు కూలిపోయిందని ఇరాన్ ప్రభుత్వ టెలివిజన్ వెల్లడించింది.

విమానం దక్షిణ ఖొరసాన్ ప్రావిన్స్ లోని టబాస్ నగరానికి వెళుతుండగా ఈ దుర్ఘటన జరిగిందని తెలిపింది. 40 మందిపైగా మృతి చెందివుంటారని ఆందోళన చెందుతున్నారు. విమానం శకలాల కోసం గాలింపు జరుపుతున్నారు.