ఈ గ్రహంపై 700 రోజులకు ఒక ఏడాది!

71406060819_625x300భూమి సూర్యుడి చుట్టూ ఒకసారి తిరిగేందుకు 365.25 రోజులు పడుతుంది. కానీ ఈ గ్రహానికి మాత్రం 704 రోజులు పడుతుందట. అంటే మనకు రెండేళ్లు అయితే ఈ గ్ర హంపై ఒక ఏడాదే అన్నమాట. మనకు సుమారు వెయ్యి కాంతి సంవత్సరాల దూరంలో ఓ నక్షత్రం చుట్టూ తిరుగుతున్న ‘కెప్లర్-421బీ’ అనే ఈ గ్రహాన్ని నాసా కెప్లర్ టెలిస్కోపు కనుగొంది. వరుణ గ్రహం(యురెనస్) అంత సైజులో ఉన్న ఈ గ్రహం తన నక్షత్రానికి 17.70 కోట్ల కిలోమీటర్ల దూరంలో తిరుగుతోందట. అందుకే అంత లేటన్నమాట. అయినా.. మన సౌరకుటుంబంలోని గ్రహాలతో పోల్చితే ఇదేమంత ఎక్కువ కాదు. కానీ.. ఇప్పటిదాకా నిర్ధారించిన అధిగ్రహాల (సౌరకుటుంబం అవతలి గ్రహాలు)లో ఇదే అన్నింటికన్నా ఆలస్యంగా నక్షత్రాన్ని చుట్టి వస్తోందట. అన్నట్టూ.. మన పొరుగునే ఉన్న అంగారకుడు 780 రోజులకు, సౌరకుటుంబంలో అతిపెద్దదైన గురుగ్రహం 11 ఏళ్లకు, చిట్టచివరన ఉన్న నెప్ట్యూన్ ఏకంగా 164 ఏళ్లకు ఒకసారి సూర్యుడిని చుట్టి వస్తున్నాయి.
 

Leave a Comment