న్యూఢిల్లీ: మనిషి జీవితంలో ఉద్యోగం సంపాదించడం ఒక ఎత్తైతే.. దాన్ని కాపాడుకుంటూ జీవిత గమనంలో ముందుకు వెళ్లడం మరో ఎత్తు. అయితే ఉద్యోగం ఉన్నా.. సగటు భారతీయునికి సరైన భద్రత లేదట. పదవీ విరమణ వయసు వచ్చేసరికి అతని వద్ద తగిన ఆర్థిక నిల్వలు ఉండటం లేదని అమెరికన్ గ్లోబల్ ప్రొఫెషన్ సర్వీస్ అయిన టవర్స్ వాస్టన్ స్పష్టం చేసింది. అత్యధిక శాతం మంది భారతీయులు పదవీ విరమణ చేసే నాటికి వారికి భరోసా లోపిస్తుందని పేర్కొంది.
దీనికి వారు ఉద్యోగం సమయంలో చోటు చేసుకునే ఒత్తిడితో పాటు, సరైన ప్రణాళిక లేకపోటమే ప్రధాన కారణంగా తెలిపింది. 78 శాతం మంది భారతీయుల్లో పదవీ విరమణ అనేది అత్యధిక భారంగా మారిందని టవర్స్ వాస్టన్ డైరెక్టర్ అనురాధా శ్రీరాం తెలిపాడు. కేవలం 16 శాతం మంది భారతీయులు మాత్రమే అత్యధిక మొత్తంలో సేవింగ్స్ చేస్తున్నారని పేర్కొన్నాడు. అయితే ఈ విషయంలో చైనా మనకంటే వెనకంజలో ఉంది. చైనాలో ఇదే స్థాయిలో ఆందోళన ఉండటం క్రమేపీ ఆ ఉద్యోగుల జీవితాలను ప్రశ్నార్థకంగా మారుస్తుందని శ్రీరాం తెలిపాడు.
Recent Comments