మన వెబ్ సైట్లకు హ్యాకింగ్ ముప్పు

61389905895_625x300మన భారతీయ వెబ్ సైట్లకు హ్యాకింగ్ ముప్పు ముంచుకొస్తోందా? ప్రపంచంలోని పలు దేశాల నుంచి మన వెబ్ సైట్లను హ్యాక్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

ఈ ఏడాది మే నెల వరకూ మొత్తం 9174 వెబ్ సైట్లను హ్యాక్ చేశారు. అమెరికా, యూరప్, చైనా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, అల్జీరియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్ల నుంచి ప్రధానంగా హ్యాకింగ్ జరుగుతోందని కేంద్ర ఐటీ మంత్రి రవిశంకర ప్రసాద్ చెబుతున్నారు.
ఇప్పటి వరకూ 62189 హ్యాకింగ్ యత్నాలు జరిగాయని ఫిర్యాదులు వచ్చాయి. ఈ వివరాలు ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ వెల్లడించింది. కాబట్టి వెబ్ సైట్ యజమానులూ… తస్మాత్ జాగ్రత!

Leave a Comment