9/11 మృతులకు మోడీ నివాళి

అమెరికా పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్రమోడీ 9/11 దాడిలో మృతి చెందిన వారికి నివాళులర్పించారు. ఈరోజు న్యూయార్క్ లోని 9/11 గ్రౌండ్ జీరో స్మారక స్థూపాల వద్ద ఆయన పూలు ఉంచి నమస్కరించారు. అనంతరం మోడీ 9/11 మ్యూజియంను సందర్శించారు. 2001 సెప్టెంబర్ 11న వరల్డ్ ట్రేడ్ సెంటర్ పై జరిగిన దాడిలో దాదాపు మూడువేల మంది మరణించిన సంగతి తెలిసిందే.

Leave a Comment