తరలిపోయే తనే వసంతం

సిరివెన్నెల అస్తమయం

తెలుగు చలనచిత్ర సాహిత్య దిగ్గజం సిరివెన్నెల సీతారామశాస్త్రి ఇక లేరు…

సికింద్రాబాద్ లోని కిమ్స్ వైద్యశాలలో గత కొన్నిరోజులుగా న్యుమోనియా సమస్యతో అత్యవసర విభాగంలో వైద్యుల పర్యవేక్షణలో ఉన్న సీతారామశాస్త్రి,.ఈ రోజు సాయంత్రం గం4.07నిముషాలకు చనిపోయారని వైద్యులు ప్రకటించారు.

సీతారామశాస్త్రి న్యుమోనియా, కిడ్నీ లంగ్ కాన్సర్ సమస్యలతో ఊపిరితిత్తులు కొంతభాగం తొలగించామని, కొన్ని రోజుల ముందే గుండెకు బైపాస్ సర్జరీ చెయ్యాల్సిరావటంతో అకాలమరణం చెందారని వైద్యులు వివరిస్తున్నారు. నిన్నటి నుండి ఆయన ఆరోగ్య పరిస్తితి విషమంగా ఉందని కిమ్స్ వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చెయ్యటం మొదలుపెట్టగానే ఆందోళనలో మునిగిన సినీరంగ ప్రముఖులు, ప్రకటన వెలువడగానే కడపటి చూపు కోసం కిమ్స్ చేరుకున్నారు. ఈ రాత్రి సీతారామశాస్త్రి భౌతికకాయాన్ని కిమ్స్ లోనే ఉంచనున్నట్లు ఆసుపత్రి సిబ్బంది తెలిపారు.

సీతారామశాస్త్రి మరణవార్తపై ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సంతాపం తెలిపారు.

చెంబోలు సీతారామశాస్త్రి ఆంధ్ర ప్రదేశ్, విశాఖ జిల్లా, అనకాపల్లిలో 20-5-1955 న జన్మించారు.

ప్రముఖ దర్శకులు K. విశ్వనాధ్ సినిమా సిరివెన్నెలతో గేయరచయితగా మొదలైన ప్రస్థానం సిరివెన్నెల చిత్రం తెచ్చిన ఖ్యాతితో అదే ఇంటి పేరు అన్నట్లుగా సాగిపోయింది. అభ్యుదయ భావాలున్న సాహిత్యవేత్తగా పేరు పడిన ఆయన కొన్ని పాటలను తనే స్వయంగా పాడటం విశేషం.

2019 సంవత్సరానికి గానూ పద్మ శ్రీ అవార్డ్ అందుకున్న సీతారామశాస్త్రి ఖాతాలో అప్పటికే 11 నంది అవార్డులు ఉన్నాయి…

ఇంకా మరెన్నో ప్రతిష్టాత్మక పురస్కారాలు సొంతం చేసుకున్న ఆయన అకస్మాత్తుగా తిరిగిరాని తీరాలకు చేరటం తెలుగు ప్రేక్షకులను దిగ్భ్రాంతిలో ముంచివేసింది…

~ విశ్వ ~

Leave a Comment