మీనా.. డేరాల పట్టణం..

61407792241_625x300కనుచూపు మేరా డేరాలే.. ఇళ్లెక్కడా కనిపించవు. అదే మీనా పట్టణం ప్రత్యేకత.  సౌదీ అరేబియాలోని మక్కాకు సమీపంలో ఉన్న మీనా సిటీ ఆఫ్ టెంట్స్‌గా పేరొందింది. 20 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఉన్న మీనాలో హజ్ యాత్రికులు బస చేస్తారు. ఇందులో లక్షకు పైగా ఏసీ టెంట్స్ ఉన్నాయి. 30 లక్షల మంది తాత్కాలికంగా బస చేసేందుకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు ఇక్కడ ఉన్నాయి. ఈ డేరాలకు టెఫ్లాన్ కోటింగ్ వేయడం వల్ల ఇవి ఫైర్ ప్రూఫ్ కూడా.. ఇందులో వంటగది, బాత్రూం వంటి సదుపాయాలన్నీ ఉంటాయి.
 
 తొలినాళ్లలో హజ్ యాత్రకు వచ్చేవారు తమ వెంటే టెంట్లను తీసుకొచ్చి.. వేసుకునేవారు. యాత్ర ముగియగానే వాటిని తీసేసేవారు. 1990ల్లో సౌదీ ప్రభుత్వం కాటన్ టెంట్లను శాశ్వత ప్రాతిపదికను ఏర్పాటు చేసింది. అయితే.. 1997లో జరిగిన అగ్నిప్రమాదంలో పలువురు చనిపోవడంతో ఈ ఫైర్‌ప్రూఫ్ డేరాల నిర్మాణాన్ని సౌదీ సర్కారు మొదలుపెట్టింది. అంతేకాదు.. అగ్ని ప్రమాదాల నివారణకు ఎన్నో చర్యలను చేపట్టింది.