మహేష్‌బాబుకి పెద్ద సవాల్‌

imagesమహేష్‌బాబు ‘దూకుడు’ నుంచి యమ దూకుడు మీద అదరగొడుతున్న సంగతి తెలిసిందే. అతని జోరుకి ‘1’ టెంపరరీగా బ్రేక్స్‌ వేసినా కానీ మహేష్‌ ‘ఆగడు’తో మరోసారి రెడ్‌ హాట్‌గా కనిపిస్తున్నాడు. ఈసారి రికార్డులు బ్రేక్‌ చేసే సినిమా ఇస్తున్నాడని ఫాన్స్‌తో పాటు ట్రేడ్‌ వర్గాల వారు కూడా అంచనా వేస్తున్నారు.  ‘పోకిరి’ తర్వాత మళ్లీ మహేష్‌బాబు నుంచి ఇండస్ట్రీ హిట్‌ రాలేదు. ఆ చిత్రం వచ్చి ఎనిమిదేళ్లు దాటిపోయింది. మగధీర అయిదేళ్ల క్రితం నెలకొల్పిన రికార్డుకే మహేష్‌ చేరువ కాలేదు. మహేష్‌ బిగ్గెస్ట్‌ హిట్‌ అయిన దూకుడు ఇప్పుడు టాప్‌ 5 కమర్షియల్‌ హిట్స్‌లో అయిదో స్థానంలో ఉంది.  అత్తారింటికి దారేది, మగధీర, గబ్బర్‌సింగ్‌, రేసుగుర్రం చిత్రాలు ఇప్పుడు టాప్‌ ఫోర్‌ ప్లేసెస్‌లో ఉన్నాయి. ఆగడుతో మహేష్‌ వీటిలో ఎన్నింటి రికార్డులు బ్రేక్‌ చేస్తాడనేది ఆసక్తికరంగా మారింది. నంబర్‌వన్‌ రేసులో టాప్‌ కంటెండర్‌గా నీరాజనాలు అందుకుంటోన్న మహేష్‌ ఇప్పుడు బాక్సాఫీస్‌ నంబర్స్‌తోను ఆ టాక్‌కి తగ్గ రిజల్ట్‌ చూపించాల్సిన టైమొచ్చింది. దీనికోసం ఇంత హైప్‌తో రిలీజ్‌ అవుతున్న ఆగడు కంటే తనకి బెటర్‌ మొమెంట్‌ ఇంకెప్పుడొస్తుంది.

Leave a Comment