సెంటిమెంట్లు వమ్ము కాలేదు

images (1)రాజేంద్ర ప్రసాద్ రీ ఎంట్రీ తరువాత ఒక్క జులాయి మినహా అన్నీ డిజాస్టర్లే..తమన్నా హ్యాపీ డేస్, 100%లవ్ మినహా అన్నీ ఫ్లాప్ లే. మహేష్ తో చాలా మంది డైరక్టర్ల రెండో సినిమాలు అపజయాలే. ఇలా చాలా సెంటి మెంట్లు వెన్నాడాయి ‘ఆగడు’ సినిమాను.  వాటికి అన్నంటికి తగ్గట్టే వుంది ఫలితం. ఎంత అద్భుతమైన హైప్ వచ్చిందో, నెగిటివ్ టాక్ కూడా అంతే వేగంగా పాకిపోయింది. పైగా ఈ సినిమా కు శ్రీను వైట్లు భార్యే స్టయిలింగ్. సినిమా సెకండాఫ్ మొత్తం హీరోను వైట్ షర్ట్ , ఖాకీ ప్యాంట్ అనే ఒకే డ్రెస్ తో చూపించారు మరి ఎంత పోలీసు క్యారెక్టరయినా అదేమి స్టయిలింగో?  విలన్ దగ్గరకు మూమూలు డ్రెస్ వేసుకు రాకూడదా..అక్కడే సదా డ్రామాలు ఆడుతున్నపుడు? అందరూ గబ్బర్ సింగ్ తో పోలిక పెడితే ఫ్యాన్స్ బాధపడ్డారు. కానీ ఆ సినిమాకు ఈ సినిమాకు వాళ్లే చాలా పోలికలు పెట్టుకున్నారు. హీరో చిన్నప్పుడు ఇంటి నుంచి పారిపోయి పోలీస్ కావడంతో సహా.

Leave a Comment