ఆ లేఖను ఉపసంహరించుకోండి

images (3)ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌తో ఆప్ నేతల భేటీ

న్యూఢిల్లీ: ఢిల్లీలో ప్రభుత్వ ఏర్పాటు కోసం బీజేపీని ఆహ్వానించేందుకు అనుమతి కోరుతూ రాష్ర్టపతికి రాసిన లేఖను ఉపసంహరించుకోవాలని లెఫ్టినెంట్ గవర్నర్‌ను ఆమ్ ఆద్మీ పార్టీ కోరింది. ఈ మేరకు బుధవారం పార్టీ నేత మనీశ్ సిసోడియాతో కలిసి ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్  విజ్ఞప్తి చేశారు. అలాగే తమ ఎమ్మెల్యేను రూ. 4 కోట్లకు లోబరచుకోడానికి బీజేపీ ప్రయత్నిస్తుండగా తీసిన వీడియో సీడీని కూడా ఎల్జీ నజీబ్ జంగ్‌కు సమర్పించినట్లు సిసోడియా మీడియాకు పేర్కొన్నారు.

ఆ వీడియోను చూడాలని నజీబ్‌ను కోరినట్లు చెప్పారు. ఇలాంటి చర్యలకు పాల్పడుతున్న బీజేపీ ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా ఇక్కడి ప్రజలకు ఒరిగేదేమీ ఉం డదని వ్యాఖ్యానించారు. ఢిల్లీ అసెంబ్లీని వెంటనే రద్దు చేసి ఎన్నికలు నిర్వహించాలని, అవసరమైతే తాము రాష్ర్టపతికి కూడా సీడీ సమర్పిస్తామని సిసోడియా తెలిపారు. కాగా ఢిల్లీలో ప్రజామోద ప్రభుత్వ ఏర్పాటుకు అన్ని మార్గాలను పరిశీలించాల్సి ఉందని, అసెంబ్లీలో అతిపెద్ద పార్టీగా ఉన్న బీజేపీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించేందుకు అనుమతించాలంటూ రాష్ర్టపతికి ఎల్జీ నజీబ్ జంగ్ తాజాగా లేఖ రాశారు.

Leave a Comment