రాజ్యసభ సీటుపై ఆలోచిస్తా.. అమీర్‌ఖాన్

download (1)ముంబయి: తనను రాజ్యసభకు నామినేట్ చేస్తామని అడిగారని బాలీవుడ్ కథానాయకుడు అమీర్‌ఖాన్ తెలిపారు. దాని గురించి తాను ఆలోచిస్తానన్నారు. క్రికెటర్ సచిన్ టెండుల్కర్, నటి రేఖ లాగా మీకూ రాజ్యసభ నామినేషన్ ఇస్తే సంతోషిస్తారా అని అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ ‘వాళ్లు నా స్నేహితులు. వాళ్లేం చేస్తున్నారనే దానిపై నేను వ్యాఖ్యానించను. నా విషయంలో ఆలోచిస్తానని మాత్రమే చెప్పాను..’ అని సమాధానమిచ్చారు అమీర్ ఖాన్. టెలివిజన్‌లో ఆయన సత్యమేవజయతే పేరుతో పలు సామాంజికాంశాలపై విశ్లేషణాత్మక కార్యక్రమాలు ప్రసారం చేసిన సంగతి తెలిసిందే.

Leave a Comment