కాంగ్రెస్ తో టచ్ లో ఉన్నాం: కేజ్రీవాల్

images (3)ఘజియాబాద్: ఢిల్లీలో ప్రభుత్వం ఏర్పాటుకు పావులు కదుపుతున్న బీజేపీకి చెక్ పెట్టేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ఆచితూచి అడుగేస్తోంది. అవసరమైతే కాంగ్రెస్ మద్దతు తీసుకోవాలని భావిస్తోంది. ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయకుండా అడ్డుకునేందుకు కాంగ్రెస్ సహా ఇతర ఎమ్మెల్యేలతో టచ్ లో ఉన్నామని ‘ఆప్’ అధినేత అరవింద్ కేజ్రీవాల్ వెల్లడించారు.

‘అన్ని పార్టీలతో టచ్ లో ఉన్నాం.  అడ్డదారుల్లో ప్రభుత్వం ఏర్పాటు చేయాలని చూస్తున్న బీజేపీని అడ్డుకునేందుకు వినోద్ కుమార్ బిన్నీ, షోయబ్ ఇక్బాల్, రంబీర్ షకీన్ తో పాటు కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో సంప్రదింపులు జరుపుతున్నాం’ అని కేజ్రీవాల్ తెలిపారు. షకీన్ స్వతంత్ర ఎమ్మెల్యే కాగా, ఇక్బాల్ జేడీ(యు) ఎమ్మెల్యే. బిన్నీ ‘ఆప్’ తరపున గెలిచినప్పటికీ ఆ పార్టీకి దూరంగా ఉంటున్నారు.

Leave a Comment