నృత్యం… మనసు భాష

images (4)”నృత్యమనేది మనసు పలికే భాష. మనసులోని భావాలను కళ్లతో ఎలా చెప్పొచ్చొ.. నృత్యంతోనూ పలికించొచ్చు. డ్యాన్స్ చేస్తుంటే మనసు ఎంతో ఉల్లాసంగా ఉంటుంది. సినిమాల్లోనే కాదు నిజజీవితంలో నృత్యానికి చాలా ప్రాధాన్యముంది” అంటోంది నయనతార. అందంతోనే కాదు, నటనతోనూ ప్రేక్షకులను అలరిస్తున్న నాయిక ఈమె. అందుకే వైవిధ్యమైన పాత్రలు ఈమెకు దక్కుతుంటాయి. ప్రస్తుతం తమిళంలో ఆరు సినిమాలతో బిజీగా ఉందీ ముద్దుగుమ్మ. ”ఎవరైనా నటీనటులు ఈ స్థాయిలో ఉనారంటే అది ప్రేక్షకులు, అభిమానుల వల్లే. ఓ సినిమా చేస్తున్నామంటే అందులో ఏ అంశాలుండాలి. ప్రేక్షకులను ఎలాంటి విషయాలు ఆకట్టుకుంటాయి అనే విషయాల్ని మనసులో పెట్టుకోవాలి. నేను చాలా తక్కువగా అభిమానుల్ని కలుస్తుంటాను. ఆ కొద్దిసార్లు కూడా అభిమానులు చెప్పే మాటలు వినడానికి ఎక్కువ ప్రాధాన్యమిస్తాను. వాళ్లు చెప్పే చిన్న చిన్న విషయాలూ చాలా విలువైనవి. ఎందుకంటే నా కంటే నా గురించి వాళ్లకే ఎక్కువ తెలుసు” అని చెప్పింది నయనతార.

Leave a Comment