హైవేలో దోపిడికి గురైన నటి

71407317854_625x300ముంబై: బాలీవుడ్ వర్ధమాన నటి, మోడల్ శ్రీజిత డె ఇటీవల దోపిడికి గురయ్యారు. ఇటీవల ముంబై సమీపంలో వెస్ట్రన్ ఎక్స్ప్రెస్ హైవేపై కారులో ప్రయాణిస్తుండగా ఈ సంఘటన జరిగింది.

 శ్రీజిత సమీప బంధువులతో కలసి ముంబైకి దగ్గరలోని ఓ డాబాకు వెళ్లారు. అక్కడ డిన్నర్ చేసి రాత్రి ఆలస్యంగా ఇంటికి బయల్దేరారు. స్థానిక గూండాలు ఆమెపై దౌర్జన్యం చేశారు. మొబైల్ ఫోన్, ఇతర వస్తువులు దోచుకున్నారు. దోపిడి జరిగిన విషయంపై శ్రీజిత పోలీసులకు ఫిర్యాదు చేశారు. శ్రీజిత రెండు మూడు బాలీవుడ్ సినిమాలతో పాటు పలు సీరియళ్లలో నటించారు.