బాలీవుడ్ మిత్రవింద?

images (2)తెలుగు తెర సంచలనం ‘మగధీర’ హక్కుల్ని దర్శకనిర్మాత సాజిద్ నడియాడ్‌వాలా సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇందులో కథానాయకునిగా షాహిద్‌కపూర్ ఇప్పటికే ఖరారైనట్లు సమాచారం. మరి కథానాయిక పాత్ర పోషించేదెవరు? అనేది గత కొన్ని రోజులుగా బాలీవుడ్‌లో నలుగుతున్న ప్రశ్న. తొలుత మాతృకలో కథానాయికగా నటించిన కాజల్ అగర్వాల్‌నే కథానాయికగా తీసుకోవాలని సాజిద్ నడియాడ్‌వాలా భావించారు.
 
  బాలీవుడ్ తెరపై మిత్రవిందగా కాజల్ మెరవనున్నారని వార్తలు కూడా మీడియాలో హల్‌చల్ చేశాయి. అయితే… కొందరు శ్రేయోభిలాషులు… ‘కాజల్ అయితే… ఫ్రెష్‌నెస్ ఉండదు’ అని చెప్పడంలో సాజిద్ తన అభిప్రాయాన్ని మార్చుకున్నారట. మరి బాలీవుడ్ మిత్రవింద ఎవరు? అని అందరూ అనుకుంటున్న తరుణంలో… సీన్‌లోకి అలియా భట్ వచ్చారు. ఈ పాత్రకు అలియా వందకు వంద శాతం యాప్ట్ అని యూనిట్ మొత్తం ఏకగ్రీవంగా ఓటు వేయడంతో, అలియాను మిత్రవిందగా ఖరారు చేసేశారట సాజిద్. వచ్చే నెల చివర్లో ఈ సినిమా సెట్స్‌కి వెళుతుందని సమాచారం.