చందమామపై గ్రహాంతరవాసి!

81408043898_625x300చంద్రుడి ఉపరితలంపై నిలుచున్న మనిషి. ఆ మనిషి తాలూకు నీడ..! ఇంకేం.. ఈ ఫొటోలో కనిపిస్తున్నది కచ్చితంగా గ్రహాంతరవాసి(ఏలియన్) అయి ఉండవచ్చని ఇప్పుడు నెటిజన్లు చర్చించుకుంటున్నారు. అమెరికా అంతరిక్ష సంస్థ నాసా ఉపగ్రహం తీసిన ఈ ఫొటో ఇప్పుడు యూట్యూబ్‌లో హల్‌చల్ చేస్తోంది.

ఇప్పటికే ఈ వీడియోను 20 లక్షల మంది దాకా చూసేశారు. గూగుల్ ఎర్త్‌లాగా.. గూగుల్ మూన్‌ను కూడా సిద్ధం చేయాలని ఫొటోలు తీయగా.. వాటిల్లోని ఓ ఫొటోలోనే ఈ ‘ఏలియన్’ దృశ్యం కనపడిందట. అయితే ఇంతకూ ఈ ఫొటోలో ఉన్నది ఏమిటి? అన్నది నాసా ధ్రువీకరించాల్సి ఉంది.