బన్నీకి మూడున్నర కోట్లిచ్చారా?

images (1)రుద్రమదేవి సినిమాలో బన్నీ కీలకపాత్ర ధరించాడు. అయితే సినిమాకు అల్లు అరవింద్ దన్నుగా నిలిచాడని, షేర్ తీసుకున్నారనీ, అందుకే బన్నీ అందులో నటించాడని వార్తలు వినవచ్చాయి. అయితే ఆ వార్తల సంగతి అలా వుంచితే, బన్నీ మాత్రం ఈ సినిమాలో నటించినందుకు గాను 20 రోజులకు భారీగానే పారితోషికం తీసుకున్నట్లు ఇప్పుడు కొత్త వార్తలు వినవస్తున్నాయి.  ఇరవై రోజుల పాటు నటించినందుకు అనుకోండి..పాత్ర నిడివి మేరకు అనుకోండి మూడున్నర కోట్ల వరకు తీసుకున్నట్లు తెలుస్తోంది. అంటే చిన్న మొత్తమేమీ కాదు. అలా అని గుణశేఖర్ కు నష్టమూ లేదు.అల్లు అర్జున్ సినిమాకు చాలా అడ్వాంటేజ్ అవుతాడు కూడా. అందకే ఇచ్చే వుండొచ్చు.

Leave a Comment