వలస వచ్చిన కేసీఆర్ సీఎం కావచ్చు కానీ…

71389808120_625x300హైదరాబాద్: తన సోదరుడు అనం రామ్నారాయణ రెడ్డితోపాటు తాను తుది శ్వాస ఉన్నంత వరకు కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతామని మాజీ మంత్రి ఆనం వివేకానందరెడ్డి స్ఫష్టం చేశారు. టీడీపీ, బీజేపీలో తాము చేరుతున్నామంటూ వస్తున్న వార్తలను వివేకా ఈ సందర్బంగా ఖండించారు. బుధవారం హైదరాబాద్లో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ… తెలంగాణ సీఎం కేసీఆర్పై నిప్పులు చెరిగారు. విజయనగరం నుంచి గతంలో కేసీఆర్ తెలంగాణకు వలస వచ్చారని గుర్తు చేశారు.

అలాంటి వ్యక్తి తెలంగాణకు రాష్ట్రానికి సీఎం కావొచ్చు కానీ ఏళ్ల తరబడి స్థానికంగా ఇక్కడే ఉంటున్నవారు స్థానికులు కారని చెప్పడం ఎంత వరకు సబబని ప్రశ్నించారు. స్థానికతకు 1956 ప్రాతిపదిక అయితే లక్షలాది కుటుంబాలకు అన్యాయం జరుగుతుందని తెలిపారు. స్థానికత విషయంలో తన వైఖరిని మార్చుకోవాలని కేసీఆర్కు ఈ సందర్భంగా వివేకా హితవు పలికారు.