ఆంధ్రప్రదేశ్ రాజధాని ఖాయమైపోయింది. విజయవాడ, పరిసర ప్రాంతాల్లోనే రాజధాని అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అసెంబ్లీలో ప్రకటించారు. దాంతోపాటుగా, అభివృద్ధి అన్ని జిల్లాలకూ విస్తరించేలా రూపొందించిన ప్రణాళికను అసెంబ్లీ ముందుంచారాయన. రాజధాని కోసం భూముల్ని సేకరించేందుకు కమిటీని ఏర్పాటు చేసినట్లు చంద్రబాబు వెల్లడించారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. వివిధ జిల్లాలు, ఆయా జిల్లాలకు దక్కనున్న ప్రాజెక్టుల వివరాలిలా వున్నాయి. శ్రీకాకుళం – ఎలక్ట్రానిక్స్, హార్డ్‌వేర్ హబ్ విజయనగరం – గిరిజన విశ్వ విద్యాలయం, మెడికల్ కాలేజ్ విశాఖపట్నం – ఐటీ హబ్, మెట్రో రైల్, అంతర్జాతీయ విమానాశ్రయం, ఫుడ్ పార్క్, రైల్వే జోన్ తూర్పుగోదావరి – పెట్రోలియం, తెలుగు యూనివర్సిటీ పశ్చిమగోదవరి – ఎన్ ఐటీ, ఉద్యానవన పరిశోధనా కేంద్రం గుంటూరు – వ్యవసాయ యూనివర్సిటీ, ఎయిమ్స్ ప్రకాశం – మైన్స్ అండ్ మినరల్ యూనివర్సిటీ నెల్లూరు – ఆటోమొబైల్, ఎరువుల కర్మాగారం కడప – ఉర్దూ యూనివర్సిటీ, స్టీల్ ప్లాంట్, సోలార్, విండ్ పవర్ అనంతపురం – సెంట్రల్ యూనివర్సిటీ, ఎయిమ్స్ అనుబంధ కేంద్రం కర్నూలు – న్యూక్లియర్ ఫ్యూయెల్ కాంప్లెక్స్, ఐఐఐటీ, స్విమ్స్ తరహా ఆసుపత్రి 3 మెగా సిటీలు: విశాఖ, తిరుపతి, విజయవాడ మెగా సిటీలు, మెట్రో రైల్ ప్రాజెక్టులు 14 స్మార్ట్ సిటీలు: వాటిల్లో శ్రీకాకుళం, విజయనగరం, కాకినాడ, రాజమండ్రి, కర్నూలు, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు, అనంతపురం సహా మరికొన్ని ప్రధాన నగరాలు. అన్ని జిల్లాలకూ ఎయిర్‌పోర్ట్ సౌకర్యం. విశాఖ, విజయవాడ, తిరుపతిలలో అంతర్జాతీయ విమానాశ్రయాలు.
Recent Comments