అక్టోబర్ రెండు నుంచి పెరుగుతున్న పింఛన్లు ఇస్తాం అని గడచిన రెండు నెలలుగా చెబుతూ వస్తున్నారు. ఎన్నికల ముందు నుంచి పింఛన్లు ఆగిపోయి వృద్దులు, వికలాంగులు ఇబ్బంది పడుతున్నారు. ఎప్పుడు అక్టోబర్ వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. వాళ్లకు సెప్టెంబర్ వస్తూనే పిడుగులాంటి వార్త తెచ్చింది. ఫించన్లు పొందుతున్నవారంతా మళ్లీ ఓ సారి ఆఫీసులకు రావాలి. వెరిఫికేషన్ అంటూ చాలా చోట్లు వినవచ్చింది. దాంతో పాపం, రెవెన్యూ ఆఫీసుల చుట్టూ తిరిగారు. ఇప్పుడు ఇంకో పదిరోజులు వుందనగా మళ్లీ గ్రామ సభలు, కమిటీలు, సభ్యులు, పేదరికం ఆధారంగా పింఛన్లు అంటూ కొత్త మాటలు వినిపిస్తున్నాయి. దీంతో పెంచిన మేరకే కాదు, అసలు మరింతగా పింఛన్లు తెగ్గోసి, ప్రభుత్వంపై భారం దించుకుంటారేమో అన్న భయం కనిపిస్తోంది. అది నిజం కాదు అని చెప్పాలంటే, గతంలో ఎందరికి ఫించన్లు ఇచ్చేవారు. ఇప్పుడు ఎంతమందికి ఇస్తారు. ఎంతమందిని కొత్తగా చేర్చారు. ఎంత మందిని తీసేసారు వంటి వివరాలతో మరో శ్వేత పత్రం ఇస్తే మంచిది కదా..అది అలవాటు అయిన పనే కదా?
Recent Comments