ఇక ఆంధ్ర సర్వే

images (2) కెసిఆర్ సర్వేను వ్యతిరేకించడంలో పాత్ర వహించిన తెలుగుదేశం పార్టీ అధికారంలో వున్న ఆంధ్రలో కూడా సర్వే ప్రకటన వచ్చింది. బోగస్ కార్తుల ఏరివేతకు సర్వే చేస్తామని మంత్రి పరిటాల సునీత చెప్పారు. ఇది తూర్పుగోదావరి నుంచి ప్రారంభమవుతుందట.  దీనికి వారు కొత్తగా ఈ పాస్ అనే పేరు పెట్టారు. ఇది ముందు తూ గో జిల్లాలో అయిన తరువాత రాష్ట్రం అంతా చేసి బోగస్ లబ్ధిదారులను ఏరివేస్తారట. అదీ సంగతి. ఏ ప్రభుత్వమైనా ఇలాంటి సర్వే చేయాల్సిందే. లేకుంటే అనవసరంగా ప్రభుత్వం నిధులు పక్కదారి పడతాయి.కానీ మనం చేస్తే మంచి, ఎదుటివాడు చేస్తే తప్పు అనుకుంటేనే వస్తుంది తకరారు.

Leave a Comment