పాపం సమంతకి బాగానే తగిలింది

images (1)రచ్చ ఎంత గెలిచినా కానీ ఇంట గెలవకపోతే ఆ కిక్కు ఉండదేమో. తెలుగునాట టాప్‌ హీరోయిన్‌ అయినా కానీ తమిళంలో ప్రూవ్‌ చేసుకోలేకపోవడం ఒక వెలితిగా ఫీలయ్యేది సమంత. నాలుగేళ్ల తర్వాత తనకి తమిళంలో పెద్ద హీరోతో అవకాశం వచ్చేసరికి ఇక తన సత్తా ఏంటో తమిళ వాళ్లకీ చూపించాలని అనుకుంది సమంత.  కానీ అనూహ్యంగా అంజాన్‌ అట్టర్‌ఫ్లాప్‌ అవడంతో సమంత తీవ్రంగా డిజప్పాయింట్‌ అయింది. మామూలుగా ట్విట్టర్‌లో చాలా యాక్టివ్‌గా ఉండే సమంత ‘అంజాన్‌’ రిలీజ్‌ తర్వాత ట్విట్టర్‌లో కనిపించకుండా పోయింది. ఈ సినిమాలో బికినీ వేసిందని వార్తలొస్తే అవి పుకార్లంటూ బొంకిన సమంత ఇప్పుడు దాని గురించి గుచ్చి గుచ్చి అడిగే వారికి ఏం సమాధానం ఇవ్వాలో తెలీక ముఖం చాటేసింది.  తెలుగులో ఘన విజయాలు ఎన్నో చవిచూసిన సమంతకి ఇక్కడ కొన్ని ఫ్లాపులు తగిలినా కానీ అవి పెద్దగా ఎఫెక్ట్‌ చూపించలేదు. కానీ తమిళంలో మాత్రం తనకి ఐరెన్‌లెగ్‌ అనే ముద్ర పడిపోవడంతో పాపం బాగానే ఫీలవుతోంది. కనీసం విజయ్‌ అయినా తన కత్తితో సమంతకి ఉపశమనం ఇస్తాడో లేదో? అదీ ఫ్లాపయితే సమంత ఇక తమిళ రంగంపై ఆశలు వదిలేసుకోవచ్చు.