వ్యభిచారం కేసులో మరో సినిమా నటి అరెస్ట్

గుంటూరు: శ్వేతాబసు ప్రసాద్ ఉదంతం మరిచిపోకముందే మరో సినిమా నటి వ్యభిచారం కేసులో దొరికింది. బీటెక్‌బాబు సినిమాలో నటించిన ఓ యువతిని వ్యభిచారం కేసులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గుంటూరు నగర శివారు ప్రాంతంలో వ్యభిచారం నిర్వహిస్తున్న ఇంటిపై ఆదివారం సాయంత్రం పోలీసులు ఆకస్మిక దాడులు జరిపి ఏడుగురిని అరెస్టు చేశారు. వీరిలో ఇద్దరు టీవీ నటులు కాగా, బీటెక్‌బాబు సినిమాలో నటించిన ఓ యువతి ఉన్నారు.

బ్రాడీపేటలోని రూరల్ పోలీస్ స్టేషన్‌లో నిర్వహించిన విలేకరులు సమావేశంలో సౌత్‌జోన్ డీఎస్పీ కె.నరసింహ వివరాలు వెల్లడించారు. శివారు ప్రాంతమైన స్వర్ణభారతినగర్ మూడో లైనులో ఓ నిర్మానుష్యంగా ఉండే ప్రాంతంలో ఓ ఇంటిని సాంబ్రాజ్యం అనే ఆర్గనైజర్ అద్దెకు తీసుకుని నెలరోజులుగా వ్యభిచార గృహం నడుపుతున్నట్లు యాంటీ హ్యుమన్ ట్రాఫికింగ్ యూనిట్ సీఐ నాగరాజు, రూరల్ సీఐ వై.శ్రీనివాసరావులకు సమాచారం రావడంతో ఆ ఇంటిపై దాడి చేశారు.

పోలీసులకు పట్టుబడినవారిలో పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన టీవీ ఆర్టిస్టు ఎం.చందు, శ్రీకాకుళం జిల్లాకు చెందిన సీహెచ్ పవన్‌లతోపాటు బీటెక్ బాబు సినిమాలో హీరోయిన్‌కు స్నేహితురాలిగా నటించిన యువతి ఉన్నారు. వ్యభిచార గృహాన్ని సాంబ్రాజ్యం, గుంటూరుకు చెందిన మరో యువతి నిర్వహిస్తున్నారు. విటులు గుంటూరుకు చెందిన వి.వెంకటరామిరెడ్డి, రాజాగారితోటకు చెందిన శ్రీనివాసరావులను అరెస్టుచేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ నగరంలో ఎక్కడైనా వ్యభిచార గృహాలు నిర్వహిస్తున్నట్లు తెలిస్తే తమకు సమాచారం అందించాలని నగరవాసులను కోరారు. సమాచారం తెలియజేసినవారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. సమావేశంలో రూరల్ సీఐ శ్రీనివాసరావు పాల్గొన్నారు.

Leave a Comment