ఆగస్టు 7నుంచి సర్టిఫికెట్ల పరిశీలన

eamcetrankss_49109_23481_thumb_jpgగత మూడు నెలలుగా కౌన్సెలింగ్ కోసం ఎదురుచూస్తున్న ఎంసెట్ విద్యార్థులకు ఊరట కలిగింది. ఉన్నత విద్యామండలి బుధవారం ఎంసెట్ కౌన్సెలింగ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆగస్టు 7 నుంచి 23 వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేపట్టనున్నట్టు నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. మొదటి రోజు 1 నుంచి 5 వేల ర్యాంక్‌ వరకు ధ్రువపత్రాలను పరిశీలిస్తారు. కౌన్సెలింగ్ కోసం ఆంధ్రప్రదేశ్ లో 34, తెలంగాణలో 23 సహాయ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. 2,15,336 మంది విద్యార్థులు ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ కు హాజరుకానున్నారు.

Leave a Comment