ఆసిన్ కాళ్లు నేలకు ఆనుతున్నాయ్

downloadదక్షిణాది నుంచి బాలీవుడ్ కు వెళ్లిన భామ ఆసిన్. వెళ్లిన భామ వెళ్లినట్లే అక్కడ సెటిలైపోయింది.  మాంచి అవకాశాలు వున్న టైమ్ లో ఇటు చూడను కూడా చూడలేదు. బాలీవుడ్ లో వైభోగం కొన్ని రోజులే అయింది. ఇప్పుడు చేతిలో పెద్దగా అవకాశాలు లేవు. దీంతో మళ్లీ సౌత్ వైపు దృష్టి సారిస్తోంది.  సౌత్ లో హీరోయిన్ ల కొరత కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. అనుష్క, కాజల్, సమంత, శృతి తప్ప సరైన టాప్ హీరోయిన్  లేని వైనం గమనించింది. పైగా దీపిక,సోనాక్షి వంటి వాళ్లకు పిలిచి పీట వేస్తున్న సంగతీ చూసింది. వీటన్నింటికీ తోడు ఇప్పుడు సౌత్ లో పారితోషికాలు కూడా బాగున్నాయి.  అందుకే మళ్లీ వెనక్కు రావాలని అనుకుంటోందంట. తెలిసిన వాళ్లకు ఫోన్ లు చేసి మరీ పలకరిస్తోందట. పైగా త్వరలో శుభవార్త చెబుతానని ట్విట్టర్ లో ఊరిస్తోందట. పోనీ లెండి ఇన్నాళ్లకు మళ్లీ కాళ్లు నేలమీద ఆనుతున్నాయి.