ఒకటో తరగతి పాపపై అత్యాచారయత్నం

download (7)జగ్గంపేట : ఒకటో తరగతి చదువుతున్న ఆరేళ్ల పాపపై బడిలో అత్యాచారయత్నం జరిగింది. తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేటలో ఈ దారుణం జరిగింది. గోకవరం రోడ్డులోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఒకటో తరగతి చదువుతున్న ఆరేళ్ల చిన్నారి పాఠశాలలో బాత్‌రూమ్‌కు వెళ్లగా, అక్కడ పారిశుధ్య కార్మికుడిగా పని చేస్తున్న అప్పారావు బాత్‌రూమ్‌ తలుపు వేసి ఆమె పట్ల వికృత చేష్టలకు పాల్పడ్డాడు. అత్యాచార యత్నం కూడా చేశాడు. దాంతో భయపడిన ఆ చిన్నారి కేకలు పెట్టడంతో వెంటనే అక్కడినుంచి పారిపోయాడు.

పాప వెంటనే ఉపాధ్యాయురాలికి తెలిపినా పట్టించుకోలేదు. విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో వారు మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పారావు పరారీలో ఉండటంతో పోలీసులు పాఠశాల ప్రిన్సిపల్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Leave a Comment