21 నుంచి బీఈడీ ప్రవేశాలు

imagesవిశాఖపట్నం : ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించి ఉన్నత విద్యా మండలి ఆధ్వర్యంలో బీఈడీ ప్రవేశాల కోసం ఎడ్‌సెట్ కౌన్సెలింగ్ ప్రక్రియ ఈ నెల 23 నుంచి ప్రారంభం కానుంది. ఆంధ్ర విశ్వవిద్యాలయం(ఏయూ)లోని ఎడ్‌సెట్ కార్యాలయం బుధవారం ఈ విషయమై ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ నెల 21 నుంచి విద్యార్థుల ధ్రువపత్రాల పరిశీలన మొదలుకానుంది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఏకకాలంలో కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. తెలంగాణలో 23 కేంద్రాలు, ఆంధ్రప్రదేశ్‌లో 17 కేంద్రాలు కలిపి మొత్తం 40 కేంద్రాల్లో కౌన్సెలింగ్ చేపడతారు. ధ్రువపత్రాల పరిశీలన పూర్తయిన విద్యార్థులు ఈ నెల 23 నుంచి ఆన్‌లైన్ కౌన్సెలింగ్ ద్వారా కళాశాల ఆప్షన్లు నమోదు చేసుకోవాలి.
చి ఎన్‌సీసీ, క్రీడలు, వికలాంగులు, రక్షణ దళాల్లో పనిచేసిన వారి పిల్లల ధ్రువపత్రాల పరిశీలనకు ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేశారు. విశాఖలోని ఏయూ ఇంజినీరింగ్ కళాశాల, హైదరాబాద్ బషీర్‌బాగ్‌లోని నిజాం కళాశాల, తిరుపతిలో వెంకటేశ్వర విశ్వవిద్యాలయం, గుంటూరులో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం, వరంగల్ కాకతీయ విశ్వవిద్యాలయంలో ఆయా విద్యార్థుల ధ్రువపత్రాలను పరిశీలిస్తారు.
చి సెప్టెంబరు 21 నుంచి 28 వరకు : అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన
చి సెప్టెంబరు 23 నుంచి అక్టోబరు 1 వరకు: కౌన్సెలింగ్ ప్రక్రియ నిర్వహణ
చి అక్టోబరు 3: సీట్ల కేటాయింపు వివరాల వెల్లడి
చి అక్టోబరు 6: తరగతుల ప్రారంభం

Leave a Comment