బాలయ్య సరసన ప్రణీత?

images (7)చీర కటి సింగారిస్తే, అబ్బాయిలు కళ్లార్పడం మరిచిపోయేంత అందమున్న అమ్మడు ప్రణీత. చాలా కాలం తెలుగులో హిట్ లు లేక అల్లాడిపోయింది. అత్తారింటికి దారేది సినిమాతో బ్రేక్ వచ్చింది. ఆ ఊపులో అబ్బాయి ఎన్టీఆర్ సరసన చాన్స్ కొట్టేసింది. ఇప్పడు మరో గోల్డెన్ చాన్స్ పట్టేసింది. బాబాయ్ బాలయ్య సరసన హీరొయిన్ గా నటించబోతోంది.  సత్యదేవ్ దర్శకత్వంలో తయారవుతున్న చిత్రంలో సెకెండ్ హీరోయిన్ గా ప్రణీతను ఎంపిక చేసినట్లు బోగట్టా. ఇప్పటికే ఇందులో త్రిష ఓ హీరోయిన్ గా నటిస్తోంది. నయనతార, శ్రియ, ప్రణీత ఈ ముగ్గురు ముద్దుగుమ్మల్లో ఎవరు సెకెండ్ హీరోయిన్ అని గడచిన వారం రోజులుగా తెగ కిందామీదా పడిన యూనిట్ ఆఖరికి ప్రణీతకు ఓటేసినట్లు బోగట్టా. బాలయ్య హుషారు..ఈ భామ జోరు మరి చూడాల్సిందే.