డాన్సింగ్‌ సెన్సేషన్‌కే భయమేస్తోందా.?

imagesమల్లీశ్వరి’కీ, ‘షీలా’కీ చాలా తేడా వుంది. తెలుగులో ‘మల్లీశ్వరి’ సినిమాలో కత్రినాకైఫ్‌ డాన్సులు చూసినవారెవరికైనా, ‘ఇంత వీక్‌ డాన్సింగ్‌ పెర్ఫామెన్స్‌ మేమెప్పుడూ చూడలేదు..’ అనే అన్పిస్తుంది. కానీ, ‘మై నేమ్‌ ఈజ్‌ షీలా..’ పాటలో కత్రినాకైఫ్‌ని చూస్తే మాత్రం.. ‘వావ్‌.. డాన్సింగ్‌ సెన్సేషన్‌ అంటే ఈమెనే..’ అని అన్పించకుండా వుండదు. ‘డాన్సులు చేతకావు..’ అనే విమర్శల నుంచి.. ‘డాన్సింగ్‌ సెన్సేషన్‌..’ అన్పించుకోవడం వెనుక కత్రినా పడ్డ కష్టం చాలానే వుంది. కానీ, ఇప్పుడీ డాన్సింగ్‌ సెన్సేషన్‌.. డాన్స్‌ చేయడానికి చాలా ఇబ్బంది పడిరదట. విషయమేంటే, బాలీవుడ్‌లో హృతిక్‌ రోషన్‌తో ‘బ్యాంగ్‌ బ్యాంగ్‌’ సినిమాలో నటిస్తోంది కత్రినాకైఫ్‌. హృతిక్‌ రోషన్‌ అంటేనే డాన్సులకి కేరాఫ్‌ అడ్రస్‌. అలాంటి వ్యక్తితో డాన్స్‌ చేయడమంటే కత్రినాకైఫ్‌కి అయినా కాస్త ఇబ్బందే. ‘అమ్మో.. హృతిక్‌ రోషన్‌తో డాన్సులు చేయడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది.. అప్పుడప్పుడూ భయమేసింది కూడా అతనితో మ్యాచ్‌ చేయగలనా లేదా అని..’ అంటూ కత్రినాకైఫ్‌, హృతిక్‌పై ప్రశంసలు గుప్పించేసింది. హృతిక్‌ తక్కువ తిన్నాడా.? ‘డాన్సుల్లో కత్రినాకైఫ్‌ తర్వాతే ఎవరైనా..’ అని కితాబులిచ్చేశాడు. ఏమాటకామాట చెప్పుకోవాలంటే ఇప్పుడు డాన్సుల్లో హృతిక్‌, కత్రినా పోటా పోటీనే. ఇద్దరూ తెరపై ఏ రేంజ్‌లో డాన్సులు ఇరగదీశారో తెలియాలంటే ‘బ్యాంగ్‌ బ్యాంగ్‌’ విడుదలయ్యేదాకా వేచి చూడాల్సిందే.

Leave a Comment