రభస కోరుకుంటున్నది ఎవరు?

Bellamkonda Suresh1409126253బెల్లంకొండ సురేష్ బకాయి పడ్డ సుమారు 60 లక్షల మొత్తం కోసం మంచు ఫ్యామిలీ అనుచరుల నిరసన కొనసాగుతోంది. నిజానికి ఇదేమంత పెద్ద మొత్తం కాదు. ఇరు పార్టీలకు కూడా. పంతాలు పట్టింపులు తప్ప. మరెందుకు ఇలా జరుగుతోందన్నది ప్రశ్న. బెల్లంకొండ కావచ్చు, ఇటు మంచు ఫ్యామిలీ కావచ్చు పంతాలకు వెళ్తున్నట్లు కనిపిస్తోంది. నిజానికి డబ్బులు రాబట్టుకునే మార్గం అయితే ఇది కాదు. కానీ అన్ని మార్గాలు ప్రయత్నించేసామని మంచు అనుచరులు అంటున్నారు.  ల్యాబ్ లో నో డ్యూ సర్టిఫికెట్ ఇస్తే తప్ప ప్రింట్ ఇవ్వని నిబంధనను ఇప్పుడు చాలా మంది అంగీకరించడం లేదని తెలుస్తోంది. అలాంటి నిబంధన చెల్లదన్న వాదనలు షురూ అయ్యాయని వినికిడి. రెండు వైపులా పెద్ద పార్టీలు వుంటే చాంబర్ కూడా చేతులెత్తేసే పరిస్థితి. ఒక పక్క కొడుకు సినిమా ప్రారంభోత్సవం, మరో పక్క రభస సినిమా విడుదల పెట్టుకుని బెల్లంకొండ ఎందుకు ఇంతవరకు తెచ్చుకున్నట్లు? పోనీ ఇలాంటి పరిస్థితుల్లో సాటి నిర్మాతే కదా  అని మంచు ఫ్యామిలీ ఎందుకు కాస్త టైమ్ ఇవ్వడం లేదు. ఇవన్నీ ప్రశ్నలే. ఇవిలా వుంటే ఈ ఉదయం 12గంటల ప్రాంతంలో బెల్లంకొండ స్వయంగా మంచు విష్ణు ఆఫీసుకు వెళ్లినట్లు తెలిసింది. అక్కడ ఫ్రస్తుతం చర్చలు సాగుతున్నట్లు బోగట్టా.