సేవకురాలిగా

Bindu-Madhavi-Photos-In-Saree-In-Tamiluku-En-Ondrai-Aluthavum-Movie-3ఈతరం నాయికల్లో హన్సిక, త్రిష వంటి వారు తమ నటనతో ప్రేక్షకులను అలరిస్తూనే మరో పక్క సామాజిక  సేవల్లో తరిస్తున్నారు. అలా ప్రస్తతం కళా సేవ చేస్తున్న అచ్చ తెలుగు ముద్దుగుమ్మ బిందుమాధవి. నిజ జీవితంలో సామాజిక సేవ గురించి పక్కనపెడితే అలాంటి పాత్రను మాత్రం తన తాజా చిత్రంలో పోషిస్తున్నారు. కోలీవుడ్‌లో మోస్ట్ గ్లామరస్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న ఈ బ్యూటీ ప్రస్తుతం తమిళుక్కు ఎన్ ఒండ్రై అళుత్తవుం (ప్రెస్ 1 పర్ తమిళ్) చిత్రంలో నటిస్తున్నారు.

ఇందులో ఈ ముద్దు గుమ్మ సోషల్ వర్కర్ పాత్రలో నటిస్తున్నారట. దీని గురించి బిందుమాధవి తెలుపుతూ ఈ చిత్రంలో తన పాత్ర చాలా హోమ్లీగా ఉంటుందన్నారు. బ్యాంక్‌లో పని చేసే ఈ పాత్ర పేరు సిమి అని తెలిపారు. సామాజిక దృక్పథంతో కూడిన ఈ పాత్ర తనకు చాలా బాగా నచ్చిందన్నారు. జీవితంలో ప్రతి ఒక్కరూ ఎప్పుడో ఒకప్పుడు ఎదుర్కొనే సంఘటన ఆధారంగా తెరకెక్కుతున్న తమిళుక్కు ఎన్ ఒండ్రై అళుత్తవుం చిత్రంలో నటించడం చాలా సంతోషంగా ఉందన్నారు.

చిత్రంలోని పాత్రలన్నీ ఆ సంఘటన చుట్టూనే తిరుగుతాయని వివరించారు. తన పక్కన అట్టకత్తి దినేష్ నటిస్తున్నారని మరో జంటగా నకుల్, ఐశ్వర్య దత్‌లు నటిస్తున్నారని వెల్లడించారు. దర్శకుడు రామ్‌ప్రకాశ్, తన పాత్రను చాలా వైవిధ్యంగా తీర్చిదిద్దారని చెప్పారు. ఇలాంటి పాత్రలో నటించడం ఆనందంగా ఉందని బిందుమాధవి అంటున్నారు. తమిళుక్కు ఎన్ ఒండ్రై అళుత్తవుం చిత్రం మూడు ప్రేమ కథలతో తెరకెక్కిస్తున్న థ్రిల్లర్ చిత్రం అని దర్శకుడు తెలిపారు.