32 ఏళ్ళ గ్లామర్‌ ‘క్వీన్‌’

imagesపరిచయం అక్కర్లేని పేరు ఆమెది. ‘ఇష్టం’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన శ్రియ, తెలుగులో అగ్రహీరోలందరితోనూ నటించేసింది. చిరంజీవితో ‘ఠాగూర్‌’, బాలకృష్ణతో ‘చెన్నకేశవరెడ్డి’, నాగార్జునతో ‘సంతోషం’, ‘నేనున్నాను’, వెంకటేష్‌తో ‘సుభాష్‌ చంద్రబోస్‌’, పవన్‌కళ్యాణ్‌తో ‘బాలు’, ప్రభాస్‌తో ‘ఛత్రపతి’, మహేష్‌తో ‘అర్జున్‌’.. ఇలా స్టార్‌ హీరోస్‌ అందరితోనూ సినిమాలు చేసిన శ్రియ, తెలుగులో నెంబర్‌ వన్‌ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగింది. తమిళంలోనూ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌తోపాటు పలువురు హీరోలతో నటించిన శ్రియ పుట్టినరోజు నేడు. సినీ తారగా ఓ వెలుగు వెలుగుతూనే, ర్యాంప్‌పై అందాలు ఒలకబోయడంలో శ్రియ తనదైన ప్రత్యేకతను చాటుకుంది. మోడ్రన్‌ డ్రస్సుల్లో ఎలాగైతే కుర్రకారుని గిలిగింతలు పెట్టగలదో, దానికి రెట్టింపు అందాల విందు సంప్రదాయ దుస్తుల్లోనూ చేయగల సత్తా శ్రియ సొంతం. నటన పరంగానూ శ్రియ పలు సినిమాలతో తానేంటో నిరూపించుకుంది. ఎక్కువగా ట్రెడిషనల్‌ దుస్తుల్లోనే శ్రియ ‘గ్లామర్‌ క్వీన్‌’ అన్పించుకోవడం విశేషం. చీర కట్టుకి సరికొత్త అందం తెచ్చింది శ్రియ.. అనడం అతిశయోక్తి కాదేమో.! ర్యాంప్‌ షోలలో అయినా, ఎక్కువగా ట్రెడిషనల్‌ దుస్తులపైనే ఆమె ఫోకస్‌ పెడ్తుంది. అదే ఆమెకు ప్రత్యేకతను తెచ్చిపెడ్తోంది. వయసు మీద పడ్తున్నా వన్నె తరగని అందం.. అని పలువురి ప్రశంసలూ అందుకుంటోంది శ్రియ.

Leave a Comment