చర్చించుకుందాం రండి!


51403431797_625x300నల్లధనంపై భారత అధికారులకు స్విస్ ఆహ్వానం

 
న్యూఢిల్లీ/బెర్న్: నల్లధనం  ఖాతాల విషయంలో చర్చలు జరపడానికి స్విట్జర్లాండ్ ప్రభుత్వం భారత అధికారులను తమ దేశానికి ఆహ్వానించింది. అయితే దీనిపై తదుపరి వివరాలను తెలపడానికి స్విస్ ఆర్థిక మంత్రిత్వ శాఖ నిరాకరించింది. ఫ్రాన్స్, జర్మనీ తదితర దేశాల ద్వారా బయటకు వచ్చిన భారత ఖాతాదారుల జాబితా విషయంలో ఎలాంటి చర్చలూ ఉండవని తెలుస్తోంది. ఆయా బ్యాంకుల్లో పనిచేసిన మాజీ ఉద్యోగుల ద్వారా ఈ జాబితాలు బయటకు వచ్చాయని సమాచారం. అక్రమపద్ధతుల్లో బయటకు వచ్చిన వివరాలపై తాము మాట్లాడబోమని స్విస్ అధికారులు అంటున్నారు.

‘నల్ల’ నోట్లలో నకిలీలు

 భారత్‌కు చెందిన పలువురు వ్యక్తులు, సంస్థలు స్విట్జర్లాండ్‌లో దాచుకున్న నల్లధనం గురించి ఓ వైపు తీవ్రస్థాయిలో చర్చోపచర్చలు జరుగుతుంటే మరో పక్క ఈ నల్లధనంలో నకిలీనోట్లు వస్తున్నాయని స్విస్ అధికారులు గుర్తించారు. యూరోలు, డాలర్ల తర్వాత భారత కరెన్సీలోనే ఎక్కువగా నకిలీనోట్లు వస్తున్నాయని స్విస్ పోలీసులు తెలిపారు. 2013 సంవత్సరంలో 2,394 నకిలీ యూరోనోట్లు వచ్చినట్లు అధికారులు గుర్తించారు. అలాగే 1,101 నకిలీ అమెరికా డాలర్లు వచ్చినట్లు కనుగొన్నారు. ఇక భారత కరెన్సీ విషయానికి వస్తే 2013లో 403 నకిలీనోట్లు వచ్చినట్లు గుర్తించారు. ఈ విషయంలో భారత్ మూడోస్థానంలో ఉందని స్విస్ పోలీసులు విడుదల చేసిన తాజా గణాంకాలు వెల్లడించాయి. ఇందులో రూ. 500 నోట్లు 380, 23 వెయ్యిరూపాయల నోట్లు ఉన్నట్టు గుర్తించారు.
 

Leave a Comment