హాట్ స్విమ్ సూట్ లో పవన్ హీరోయిన్

ముంబై :పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన ‘బద్రి’ చిత్రం ద్వారా తెలుగు తెరకు పరియమైన బాలీవుడ్ బ్యూటీ అమీషా పటేల్. ఆమె ప్రస్తుతం సినిమాలు ఏమీ చేయటం లేదు. అయితే ఇప్పుడు అందరి దృష్టినీ ఆకర్షించేందుకు ఇలా స్విమ్ సూట్ లో ఫొటో దిగింది. ఇది చూసిన వాళ్లు ఈ వయస్సులో ఇలా ఫోటో దిగి పబ్లిసిటీ చేసుకోవటం ఏంటి అని ముక్కున వేలేసుకుంటున్నారు. 2000 సంవత్సరంలో హృతిక్ రోషన్ హీరోగా వచ్చిన ‘కహోనా ప్యార్ హై’ చిత్రం ద్వారా సినీ రంగ ప్రవేశం చేసిన అమీషా పటేల్ ఆ చిత్రం విజయంతో లైమ్ లైట్ లోకి వచ్చింది. అయితే తర్వాత ఆమె నటించిన సినిమాల్లో ఎక్కువ శాతం పరాజయం పాలవ్వడంతో అమీషాకు స్టార్ హీరోయిన్ హోదా దక్కలేదు. మెయిన్ హీరోయిన్‌గా అమీషా కెరీర్ ఎప్పుడో ముగిసింది.

కేవలం తన చూపులతో….ఒంపుసొంపులతో ప్రేక్షకులకు నిషా ఎక్కించగల అందం ఆమెది. మంచి నటిగా ప్రేక్షకుల మన్నన లు పొందినా, బాలీవుడ్‌లో మంచి మంచి అవకాశాలు వచ్చినా అమీషాకెందుకో కలిసిరావడంలేదు. బాలీవుడ్ లోనూ అమీషా పటేల్ ఓ మోస్తరు హీరోయిన్ గానే రాణించింది. 2009, 2010 సంవత్సరాల్లో అసలు సినిమాలే చేయని అమీషాకి తర్వాత తెలుగులో పరమ వీర చక్ర, మరో హిందీ సినిమా అవకాశం వచ్చినా పెద్దగా లాభం లేక పోయింది. ప్రస్తుతం పలు బాలీవుడ్ సినిమాల్లో గెస్ట్ రోల్స్, స్పెషల్ సాంగ్స్, ఇతర క్రింది స్థాయి పాత్రలు చేస్తూ నెట్టుకొస్తోంది అమీషా. ప్రస్తుతం ఆమె బాలీవుడ్లో రన్ బోలా రన్, భయ్యాజీ సూపర్ హిట్, దేశి మ్యాజిక్ తదితర చిత్రాల్లో నటిస్తోంది. 37 ఏళ్ల అమీషా పటేల్ ఇప్పటికీ పెళ్లి చేసుకుండానే ఒంటరి జీవితం సాగిస్తోంది.

Leave a Comment