‘ఆ విషయంలో నా ప్లానింగ్‌ నాకుంది..’

imagesబాలీవుడ్‌, టాలీవుడ్‌ సినిమాల్లో హల్‌చల్‌ చేస్తోన్న రకుల్‌ ప్రీత్‌సింగ్‌, అక్కడా ఇక్కడా డేట్స్‌ని అడ్జస్ట్‌ చేసుకోవడంలో తన ప్లానింగ్‌ తనకుందని చెప్పుకొచ్చింది. ఒకేసారి హిందీ, తెలుగు సినిమాల్లో చేయడం.. అది కూడా ఖాళీ లేనంత బిజీగా కెరీర్‌లో దూసుకెళ్తుండడమంటే చిన్న విషయమేమీ కాదు. హిందీలో ఒకటీ అరా సినిమాలు చేస్తున్న రకుల్‌ ప్రీత్‌సింగ్‌ తెలుగులో మాత్రం యమ బిజీగా వుందనే చెప్పాలి. ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ అందాల భామ, తెలుగులో ఇప్పుడు నాలుగైదు సినిమాలు చేస్తోంది. అంతా తొలి సినిమా ఇచ్చిన సక్సెస్‌ వల్లనేననంటోన్న రకుల్‌ ప్రీత్‌సింగ్‌, అవకాశాలు రావడంతోనే ఉప్పొంగిపోననీ, వాటిని విజయాలుగా మలచుకున్నప్పుడే ఆనందపడ్తాననీ మహా ముదురు డైలాగులు చెబుతుండడం గమనార్హం. ‘ఏదో సినిమా చేశాం.. రెమ్యునరేషన్‌ తీసుకున్నాం.. అన్నట్టు కాకుండా, మంచి కథల్ని ఎంచుకోవడం మీద శ్రద్ధ పెడితేనే మంచి విజయాలు దక్కుతాయి..’ అంటున్న రకుల్‌ ప్రీత్‌సింగ్‌, ఎంత జాగ్రత్తలు తీసుకున్నా, అదృష్టమూ కలిసి రానిదే సక్సెస్‌ కొట్టలేమనీ వ్యాఖ్యానించింది. మొత్తమ్మీద, బాలీవుడ్‌ ` టాలీవుడ్‌ రెండిట్లోనూ బిజీగా వున్న రకుల్‌ కెరీర్‌ని పక్కాగా ప్లాన్‌ చేసుకుంటోందన్నమాట.

Leave a Comment