తప్పు చేసిన సంగతి నిజమే

images (1)తప్పులు చేసి తిరుపతికి వెళ్ళి మొక్కు తీర్చుకుంటే సరి.. అన్ని పాపాలూ హరించుకుపోతాయని ఆలోచించేవాళ్ళు  ఎందరో వున్నారు. అసలు తప్పంటూ చేశాక దాన్ని జనం ముందు ఒప్పుకోవడంతోనే మనం నిజాయితీ చాటుకున్నవాళ్ళం అవుతాం.. అని చెబుతోంది గతంలో పోర్న్‌స్టార్‌, ఇప్పుడు సినిమా స్టార్‌ అయ్యిన సన్నీలియోన్‌.  పంజాబీ బ్రీడ్‌కి చెందిన సన్నీలియోన్‌ విదేశాల్లో పుట్టి పెరిగింది. అందుకే ఆమె ఆలోచనలు కూడా ఆధునికంగా వుండటం వల్ల మనీ కోసం చిన్న వయసులోనే శృంగార చిత్రాల్లో నటించింది. సొంత మొగుడితోనే శృంగార చిత్రాల్లో నటించిన ఆమె, తన పోర్న్‌ వీడియోలతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు మెయిన్‌ స్ట్రీమ్‌ సినిమాల్లో ఒచ్చి నటిగా ఎంతో గౌరవం పొందుతున్న సన్నీలియోన్‌ తన గతం అంతా తప్పు చెయ్యడంతోనే సరిపోయిందని చెబుతోంది. ‘‘శృంగారం అనేది నాలుగు గోడల మధ్య ఆలుమగలు, ప్రేయసీ ప్రియుల మధ్య జరిగేది. అలాంటిది గోడల అడ్డు తొలగించి.. పబ్లిక్‌గా అందులో పాల్గొనడం నిజంగా తప్పేనని ఇప్పుడు తెలుస్తుంది. ఇక ముందు అలాంటి తప్పులు చెయ్యను. ఎంతయినా నాలో భారతీయత కొంత వుంది కాబట్టే అది తప్పని ఒప్పుకుంటున్నాను.. సినిమాల వల్ల నాకింత గౌరవం వస్తుందని అప్పుడు తెలియక రాంగ్‌ రూట్‌లో వెళ్ళాను. అదొక మరిచిపోవాల్సిన అంశం. నన్ను నేను సంస్కరించుకుంటేనే మనశ్శాంతిగా వుంటుంది నాకు..’’ అని సెలవిస్తుంది సన్నీలియోన్‌.

Leave a Comment