బొమన్ ఇరానీకి బెదిరింపులు

download (1)ముంబై: ప్రముఖ హిందీ నటుడు బోమన్ ఇరానీని హతమారుస్తామని రవిపూజారి ముఠా నుంచి బెదిరింపు ఫోన్ వచ్చింది. దీంతో ఆయనకు తగిన భద్రత కల్పించినట్లు నగర పోలీసు వర్గాలు తెలిపాయి. ఇరానీ రూపొందించిన ‘హ్యాపీ న్యూ ఇయర్’  సినిమా దీపావళికి విడుదల అవుతుందని ప్రకటించిన నాటి నుంచి ఆయనకు బెదిరింపులు వస్తున్నాయి. దీంతో భద్రత కల్పించారు.
 
ఇందులో షారుఖ్ ఖాన్, దీపికా పదుకొణే ప్రధాన తారాగణం. అయితే ఈ సినిమా అంతర్జాతీయ హక్కుల కోసం రవి పూజారి.. షారుఖ్, ఇరానీని బెదిరించినట్టు తెలి సింది. ఇదే ముఠా సభ్యులు ఆగస్టు 23న జుహూలో ఉండే నిర్మాత అలీ మొరానీ ఇంటి బయట ఐదు రౌండ్లు కాల్పులు జరిపారు. అం దులో రెండు బుల్లెట్లు పూల మొక్కల కుండీలకు, మరో రెండు కిటికీ అద్దాలకు, ఒకటి కాం పౌండ్‌లో పార్క్ చేసిన బీఎండబ్ల్యూ కారు బానెట్‌కు తగిలాయి.

మొరానీ ఇంటి ముందు కాల్పు లు జరిపిన రెండు రోజుల తరువాత షారుఖ్ ఖాన్‌కు చెందిన రెడ్ చిల్లీస్ చిత్ర నిర్మాణ సంస్థ కు పూజారి ఫోన్ చేసి బెదిరించాడు. దీంతో షారుఖ్‌తోపాటు మొరానీ, ఇరానీకి భద్రత కల్పిస్తున్నట్టు పోలీసులు ప్రకటించారు. ఇరానీ విదేశీ నంబర్ల నుంచి బెదిరింపు ఫోన్లు వచ్చినట్టు విచారణలో తేలింది. రవి పూజారి దుబాయ్ నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్నాడని పోలీసు అధికారి ఒకరు తెలిపారు.