ఆ అమ్మాయికి గడ్డం అడ్డం కాలేదు!

61407651157_625x300లండన్:మగవారికి గడ్డం పెరగడం చూస్తూనే ఉంటాం. కానీ ఓ అమ్మాయికి గడ్డం పెరిగితే.. అది ఆమెకు పెద్ద సవాలే. ఇలాంటి సవాలే బ్రిటన్‌లో నివసిస్తున్న 23 ఏళ్ల భారత సంతతి సిక్కు మహిళ హర్‌నమ్ కౌర్‌కు ఎదురైంది. ఆమెకు 16వ ఏట నుంచీ ముఖంపై వెంట్రుకలు రావడం మొదలయ్యాయి. మగవారికి గడ్డం ఎలా వస్తుందో అలాగే ఆమెకూ గడ్డం వచ్చేసింది. పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమే కారణంగా ఆమెకు ఈ పరిస్థితి ఎదురైంది. టీనే జర్‌గా కౌర్ మొదట్లో ఈ గడ్డంతో చాలా ఇబ్బందులే పడింది. ముఖానికి చేతులు అడ్డుపెట్టుకుని మాట్లాడటం.. క్లాత్ కప్పుకుని తిరగడం చేసేది. ఆమె బయటకెళితే అంతా అదో రకంగా చూసేవారు. భయపెట్టేవారు. అసభ్యంగా పిలిచేవారు. దీంతో ఆమె ఎంతో వేదన అనుభవించిందామె. ఈ సమయంలో సోదరుడు గురుదీప్ ఆమెకు ఆసరాగా నిలిచాడు.
 
ఆమెకు అన్నిట్లోనూ తోడుగా నిలిచాడు. దీంతో ఈరోజు ఆమెలో బెరుకు తగ్గింది. ఓ ప్రై మరీ స్కూల్‌లో టీచింగ్ అసిస్టెంట్‌గా పనిచేస్తూ.. తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సాధించింది. ప్రపంచంలో గడ్డం ఉన్న ఏకైక మహిళగా గుర్తింపు సాధించి ఆమెకు ఇప్పుడో అరుదైన అవకాశం దక్కింది. ప్రపంచంలోని అత్యుత్తమ గడ్డాల ఎగ్జిబిషన్‌కు ఆమె ఫొటో ఎంపికైంది. బార్డ్ సీజన్ అనే స్వచ్చంధ సంస్థ ప్రాజెక్ట్ 60 పేరుతో 60 ఉత్తమ గడ్డాల ఫొటోలను ప్రదర్శనకు పెట్టాలని నిర్ణయించింది. ఈ ప్రదర్శన త్వరలో లండన్‌లో ప్రారంభం కానుంది. ఈ ప్రదర్శనకు హర్‌నమ్ కౌర్ ఫొటో ఎంపిక కావడంతో ఆమె మరోసారి వార్తల్లోకొచ్చింది.