గూగుల్ కే బుల్స్‌కు సొరచేపల ముప్పు!

images (7)న్యూయార్క్: ఇంటర్నెట్ సెర్చింజన్ దిగ్గజం గూగుల్ కంపెనీకి సొరచేపల నుంచి ముప్పు ఎదురవుతోంది. పశ్చిమ అమెరికా నుంచి ఆసియా వరకూ సముద్రం అడుగున ఆ కంపెనీ వేసుకున్న ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్‌ను సొరచేపలు కొరికేస్తున్నాయట. కేబుల్స్ వల్ల స్వల్ప అయస్కాంత క్షేత్రాలు ఏర్పడతాయి.

అయితే ఆహార వేట కోసం సొరచేపల నోటిలో అయస్కాంత క్షేత్రాలను గుర్తించే సెన్సర్లు ఉండటంతో అవి ఈ కేబుల్స్‌ను గుర్తించి దాడి చేస్తున్నాయట. దీన్ని నిరోధించేందుకు కేబుల్స్‌కు పైపూతగా కేవ్లార్ అనే సింథటిక్ ఫైబర్‌ను పైపొరగా వాడినా ఫలితం ఉండట్లేదని తెలుస్తోంది.