క్యాడెట్ చాంప్స్ వరుణ్, అంజలి

Table tennis tournment, L.B stadiumసెయింట్ పాల్స్ టీటీ టోర్నీ
 ఎల్బీ స్టేడియం: సెయింట్ పాల్స్ అకాడమీ స్టేట్ ర్యాంకింగ్ టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్‌లో వరుణ్, అంజలి విజేతలుగా నిలిచారు. క్యాడెట్ బాలుర సింగిల్స్ టైటిల్‌ను గ్లోబల్ టీటీ అకాడమీ (జీటీటీఏ)కి చెందిన బి.వరుణ్ శంకర్ కైవసం చేసుకున్నాడు. క్యాడెట్ బాలికల సింగిల్స్ ట్రోఫీని ఎన్.అంజలి గెలుచుకుంది.  హైదర్‌గూడలోని సెయింట్ పాల్స్ హైస్కూల్‌లో శనివారం జరిగిన క్యాడెట్ బాలుర సింగిల్స్ ఫైనల్లో వరుణ్ 11-6, 11-7, 11-8తో అద్వైత్ (ఆనంద్‌నగర్ వెల్పేర్ అసోసియేషన్)పై విజయం సాధించాడు. బాలికల ఫైనల్లో అంజలి (గుజరాతీ సేవా మండలి) 11-8, 11-6, 11-1తో రుచిరా రెడ్డి (ఎస్‌పీటీటీఏ)పై గెలిచింది.
 
 స్నేహిత్‌కు సబ్-జూనియర్ టైటిల్
 సబ్-జూనియర్ బాలుర సింగిల్స్ టైటిల్‌ను నిరుటి విజేత ఎస్.ఎఫ్.ఆర్.స్నేహిత్(జీటీటీఏ) నిలబెట్టుకున్నాడు.  సబ్-జూనియర్ బాలికల సింగిల్స్ విభాగంలో జి.ప్రణీత (జీఎస్‌ఎం) ఫైనల్లోకి చేరింది. బాలుర సింగిల్స్ ఫైనల్లో స్నేహిత్ 11-4, 13-11, 11-4, 11-6తో సాయి తేజస్ (ఎస్‌పీటీటీఏ)పై నెగ్గాడు. బాలికల సింగిల్స్ సెమీఫైనల్లో ప్రణీత 11-4, 7-11, 11-9, 11-7, 7-11, 12-10తో పోరాడి వరుణి జైస్వాల్ (జీఎస్‌ఎం)పై నెగ్గింది.
 
 టీమ్ చాంపియన్ ఎస్‌బీఐ
 ఇంటర్ ఇనిస్టిట్యూషన్ టీమ్ చాంపియన్‌షిప్‌లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) జట్టు విజేతగా నిలిచింది. ఫైనల్లో ఎస్‌బీఐ జట్టు 3-2తో పోస్టల్ డిపార్ట్‌మెంట్ జట్టుపై గెలిచింది.

Leave a Comment