నటి మల్లికా షెరావత్‌పై కేసు నమోదు

41401472021_625x300కరీంనగర్: బాలీవుడ్ నటి మల్లికా షెరావత్‌పై కరీంనగర్ మూడో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు అయ్యింది. ఆమె నటించిన డర్టీ పాలిటిక్స్ అనే హిందీ చిత్రం ప్రచార పోస్టర్‌లో మల్లికా షెరావత్ జాతీయ పతాకాన్ని అవమానకర రీతి లో ధరించించారని కరీంనగర్‌కు చెందిన న్యాయవాది బేతి మహేందర్‌రెడ్డి గురువారం అదనపు ఫస్ట్‌క్లాస్ జుడిషియల్ మేజిస్ట్రేల్ కోర్టులో ఫిర్యాదు దాఖలు చేశారు.

ఫిర్యాదును పరిశీలించిన న్యాయమూర్తి అజర్ హుస్సేన్ దర్యాప్తు నిమిత్తం కరీంనగర్ మూడో పట్టణ పోలీస్‌స్టేషన్‌కు పంపించారు. కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు నటి మల్లికా షెరావత్‌పై గురువారం ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.