రాజధానికి రూ.4 లక్షల కోట్లు

images (5)కేంద్ర సాయంగా రూ.లక్ష కోట్లు ఇవ్వండి
ప్రపంచస్థాయి నగరం నిర్మిస్తామని ప్రధాని మోడీ హామీ ఇచ్చారు
ఆర్థిక సంఘానికి ఏపీ సీఎం చంద్రబాబు వెల్లడి
తిరుపతి: ఆంధ్రప్రదేశ్‌కు ప్రపంచస్థాయి రాజధానిని నిర్మించేందుకు రూ.4 లక్షల కోట్ల ఖర్చు అవుతుందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. కేంద్రసాయంగా కనీసం రూ.లక్ష కోట్లయినా ఇప్పించాలని శుక్రవారం తిరుపతిలో 14వ ఆర్థికసంఘాన్ని కోరారు. ”భూసమీకరణ ద్వారా ప్రపంచస్థాయి రాజధాని నిర్మిచాలనుకుంటున్నాం. గత ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోడీ ఢిల్లీని మించిన ప్రపంచ స్థాయి రాజధాని నగరాన్ని నిర్మిస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. అలాంటి నగరం నిర్మించాలంటే రూ.4 లక్షల కోట్లవుతుంది. 15-20 ఏళ్ల సమయం పడుతుంది. గాంధీనగర్‌ను గత 60 ఏళ్లుగా నిర్మిస్తున్నా పూర్తిస్థాయిని సంతరించుకోలేదు. హైదరాబాద్‌లోని ఉన్నతవిద్య, శిక్షణ, పరిశోధన, అభివృద్ధి కేంద్రాలను ఇక్కడ తిరిగి నెలకొల్పాలంటే భారీ పెట్టుబడులు అవసరం అవుతాయి. అందుకోసం వచ్చే అయిదేళ్లకు రాజధాని కోసం రూ.1,00,213 కోట్లు ఇవ్వండి” అని చంద్రబాబు కోరారు.

Leave a Comment