టీడీపీలో జేసీకి కూడా అంతకు మించిన మార్గంలేదా!

download (6)పార్టీ లో పదవి ఏదీ లేకుండా ఉన్న సోమిరెడ్డిచంద్రమోహన్ రెడ్డి వంటి వాళ్లకంటే మరో మార్గం లేదు. ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డిని తిడితేనే మనుగడ. ఎంతగా.. ఎంత క్రియేటివిటీతో తిడితే అంత గుర్తింపు. ఎమ్మెల్యేగా గెలవలేకపోయిన అలాంటి వాళ్లు జగన్ ను తిడితేనన్నా అధినేత ప్రసన్నం అవుతాడు.. ఏదో ఎమ్మెల్సీ పదవిని కట్టబెడతాడు అని ఆశలు పెట్టుకొన్నా అర్థం ఉంది. మరి ప్రత్యక్ష ఎన్నికల్లో సత్తా చాటలేకపోయిన అలాంటి వారు అలాంటి దారిపై ఆశలు పెట్టుకొన్నా అంతో ఇంతో అర్థంఉంది. మరి జేసీకి ఏమైంది… ఆయన కూడా పార్టీలో ప్రాధాన్యతను సంపాదించుకోవడానికి అదే దారినే ఎంచుకొన్నాడు. అడ్డగోలుగా జగన్ ను విమర్శించడం మొదలు పెట్టాడు! జేసీ అడ్డగోలుగా మాట్లాడతాడనేది మొదటి నుంచి తెలిసినే విషయమే. అయితే మరి ఆయన ఇప్పుడు కేంద్ర మంత్రి పదవి మీద పెట్టుకొన్న ఆశలు నెరవేరడానికి తన స్వరం తీవ్రతను మరింతగా పెంచినట్టున్నాడు. ఈ సారి జగన్ పార్టీపై విరుచుకుపడ్డాడు. ఆరునెలల్లో జగన్ పార్టీ మూతబడిపోతుందని తేల్చిచెప్పాడు జేసీ దివాకర్ రెడ్డి. మరి చంద్రబాబే మూత వేయిస్తాడో… లేక జేసీనే మూత వేయిస్తాడో.. కానీ జగన్ పార్టీ మూత పడటం మాత్రం ఖాయమట. మరి జేసీ సారుకు ఎందుకు అలా అనిపిస్తోంది? అంటే…  వైకాపా నుంచి ఒక్కోనేత బయటకు వస్తున్నాడని.. ఆఖరికి జగన్ ఏకాకిగా మిగిలిపోతాడని… తద్వారా వైకాపా మూత పడుతుందని జేసీ జోస్యం చెప్పాడు. ఈ జోస్యం ఏం ఫలిస్తుందో తెలీదు కానీ… ఇలాంటిమాటల ద్వారా జేసీ వంటి వాళ్లు తమ స్థాయిని మరింత తగ్గించుకొంటున్నారని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఏ పదవి మీదో ఆశలుపెట్టుకొని ఇలాంటి మాటలు మాట్లాడటం  ద్వారా బాబును ప్రసన్నం చేసుకోగలిగితే చేసుకోగలరు కానీ.. వ్యక్తిగతంగా మాత్రం స్థాయిని దిగజార్చుకోవడమే అవుతుందనేది విశ్లేషకుల అభిప్రాయం. మరి జేసీ కి కూడా ఇంతకంటే  మరో మార్గం లేదు కాబోలు!

Leave a Comment