ఆనంద్ శుభారంభం

download (1)బిల్‌బావ్ (స్పెయిన్): బిల్‌బావ్ మాస్టర్స్ చెస్ టోర్నీలో విశ్వనాథన్ ఆనంద్ శుభారంభం చేశాడు. స్పెయిన్‌లో జరుగుతున్న టోర్నీ తొలి రౌండ్లో ఆనంద్… ఫిడే మాజీ ప్రపంచ ఛాంపియన్ రుస్లాన్ పొనమారియోవ్‌ను ఓడించాడు. ఈ గెలుపుతో 3 పాయింట్లు ఖాతాలో వేసుకున్న ఆనంద్ సంయుక్తంగా అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. కార్ల్‌సన్‌తో ఈ నవంబర్‌లో ఆడే ప్రపంచ ఛాంపియన్‌షిప్ మ్యాచ్‌కు ముందు విషీ ఆడుతున్న ఆఖరి టోర్నీ ఇదే.

Leave a Comment